Aug 15,2023 17:03

మోకాలి గాయం కారణంగా వచ్చే నెలలో జరగబోయే ఆసియా క్రీడల్లో తాను పాల్గొనలేననిస్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ట్వీట్టర్‌ వేదికగా తెలిపింది. ''రెండు రోజుల క్రితం ఆగస్టు 13న ట్రైనింగ్‌ చేస్తుండగా నా ఎడమ మోకాలికి గాయమైంది. వెంటనే వైద్యులను సంప్రదించా. స్కాన్లు, ఇతర పరీక్షలు చేసిన తర్వాత.. సర్జరీ ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారు. ఆగస్టు 17న ముంబయిలో సర్జరీ చేయించుకుంటున్నా. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి స్వర్ణ పతకం సాధించా. ఈసారి కూడా ఆ పతకాన్ని దక్కించుకోవాలని కలలుకన్నా. కానీ దురదృష్టవశాత్తూ ఈ గాయం కారణంగా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయా'' అని వినేశ్‌ పోస్ట్‌ పెట్టింది.