Sep 30,2022 07:00

పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినెక్కాయి. పనులు, ఉద్యోగాలు కాపాడబడాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి. ఉద్యోగం, ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి. ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు పెంచాలి. వారికి వేతనాలు పెంచడమే కాదు, 100 రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి చట్టం రావాలి.

రల మోతతో, ఇంటా బయటా సాగుతున్న హింసతో బతకడమే సవాలుగా మారిన నేపథ్యంలో రాష్ట్ర మహిళల వేదనకు ప్రతిబింబంగా నెల్లూరులో రాష్ట్ర మహిళా వజ్రోత్సవ మహాసభలు జరిగాయి. 2 లక్షల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహించిన 300 మంది ప్రతినిధులతో సెప్టెంబరు 24, 25, 26 తేదీలలో డాక్టర్‌ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఐద్వా 15వ రాష్ట్ర మహాసభలు జయప్రదంగా జరిగాయి. హింస నుండి, దోపిడి నుండి, భద్రతతో, గౌరవంగా జీవించే హక్కు అమలు, ఉపాధి లక్ష్యాలుగా మహాసభ పిలుపు నిచ్చింది.
        ప్రజల ఓట్లతో అధికారం లోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, కష్టజీవులను అందులోనూ మహిళలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మద్యం మహమ్మారి మనుషులను రాక్షసులను చేస్తుంది. బిడ్డలు మృగాలుగా మారి తల్లిదండ్రులను చంపుతున్న ఘోరాలను చూస్తున్నాము. మహిళల నిస్సహాయతను ఆసరా చేసుకుని అత్యాచారాలు పెరుగుతున్నాయి. వ్యాపార లాభాపేక్షతో విశ్రాంతి లేని జీవితాలు. రిక్రియేషన్‌ పేరిట బూతు. పని చేసే చోట ఉద్యోగినులపై, పాఠశాలల్లో విద్యార్థినులపై ఎందెందు వెదికినా వేధింపులే! మరి మార్గం ఏమిటి? ఈ దుస్థితికి కారణం ప్రభుత్వ విధానాలే! వీటిని ప్రశ్నించాలి! ప్రతిపక్ష పాలక పార్టీలు కూడా మహిళలపై హింసను నివారించటానికి, అరికట్టడానికి ఏం చేస్తాయో నిలదీయాల్సిందే! ఇందుకోసం నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు సాగే హింసా వ్యతిరేక పక్షోత్సవం ప్రచారంగా మాత్రమేగాక కర్ర సాము, కరాటే లాంటి ఆత్మరక్షణ శిబిరాల నిర్వహణకు పూనుకోవాలి.
        ఉన్న ఉద్యోగాలు పోవడం, పని దొరకక పోవడం, అన్ని ఖర్చులు పెరగడం...ఇంటి పనికి పరిమితమైన మహిళలను కూడా వీధుల్లోకి తెచ్చింది. పనులు దొరక్క గంటల కూలీకి పచారీ షాపుల్లోనో మరో చోటో వెతుక్కుంటున్నారు. సుదూర ప్రాంతాలకు మాత్రమే కాదు, దేశ దేశాలకు ప్రయాణిస్తున్నారు. ఒళ్ళమ్ముకుని బతకాల్సిన స్థితిలో కూడా నెట్టుకొస్తున్నారు. పని దొరికితే బతకొచ్చు. పథకాలతో కాదు. పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినెక్కాయి. పనులు, ఉద్యోగాలు కాపాడబడాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి. ఉద్యోగం, ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి. ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు పెంచాలి. వారికి వేతనాలు పెంచడమే కాదు, 100 రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి చట్టం రావాలి.
సాంప్రదాయాల పేర సంకెళ్ళు! వరకట్నం, బాల్య వివాహాలు, ఆడపిల్లను గర్భంలోనే చిదిమి వేసే వారసత్వపు వాసనలు. ఋతుస్రావాన్ని అంటరానిదిగా ముట్టరానిదన్న ఆచారాలు, వితంతు దురాచారం లాంటి దుస్సాంప్రదాయాలను అంతమొందించాలన్న స్ఫూర్తిని ప్రజలకు, యువతకు అందించేందుకు పూనుకోవాలి. నేడు యువత, మహిళలు విద్య, వైద్యం, మత్తుమందులు, మౌలిక సదుపాయాలు లాంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చదువులలో, ఆటపాటలలో సమస్త రంగాలలో పట్టుదలతో సమర్ధవంతంగా పని చేస్తున్న యువతుల సంఖ్య బాగా పెరుగుతున్నది. కానీ అదే సమయంలో పెట్టుబడిదారీ క్షీణ విలువల ప్రభావంలో యువత శలభాల్లా మాడిపోతున్నది. వీటి నుండి రక్షించుకోవాలి. యువత శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవాలి. వారిని సామాజిక, రాజకీయ ఉద్యమాలలో సమీకరించాలి. అందుకు సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృత పరచాలి. సమానతకు ఆటంకంగా ఉన్న మనువాద భావజాలాన్ని అడుగడుగునా ఎదిరించాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్రను, సమానత్వం కోసం సాగిన త్యాగాలను రంగరించి శిక్షణా తరగతులను ముమ్మరంగా నిర్వహించాలి.
        ఇవన్నీ తీర్మానాలతో, సంకల్పాలతో మాత్రమే అమలు జరుగవు. ఈ రోజు కనీసం మనిషి మాదిరి బతకాలంటే ఉపాధి ఉండాలి. ఇంటా బయటా రక్షణ, భద్రత ఉండాలి. ఇది మహిళా సంఘంలో ఉన్నవారు మాత్రమే సాధించగలిగేది కాదు. అన్ని రంగాలలో పని చేస్తున్న మహిళలందరూ ఏకం కావాలి. మనతోపాటు కష్టంలో ఉన్న రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు భుజం కలపాలి. యువత ముందు పీఠిన నిలవాలి. సంస్థలతో, వ్యక్తులతో ఐక్య వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. వర్తమాన కాలంలో మహిళలు అన్ని రకాల పోరాటాలలో వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. తక్షణ వేతనాలు, భద్రత కోసమేగాక ప్రభుత్వ విధానాల మార్పు కోసం ఉద్యమించాలి. అందుకు అందరం కలవాలి, కలుపుకోవాలి. అందుకు మహిళా సంఘం ఉత్ప్రేరకంగా మారాలి. వేలాది మంది పాల్గొనడమేకాదు, అనుసరించే అనుయాయులుగా మాత్రమే కాదు, ఊయలలూపే చేతులు, ఇంటిని నిర్వహణ చేసే సమర్థత ఉన్న మహిళలు ఉద్యమాలలో ముందుడి దానికి నాయకత్వం వహించే నైపుణ్యాన్ని సముపార్జించుకోవాలి. అందుకోసం అధ్యయనం-ఆచరణను మహాసభ లక్ష్యాలుగా నిర్ణయించుకున్నది.
      పై లక్ష్యాల సాధనకు ప్రతి సందర్భాన్ని సాధనంగా మలచాలి. స్త్రీల శక్తి సామర్ధ్యాలకు చిహ్నంగా ప్రజలు జరుపుకునే దసరా సంబరాలు సంబరాలుగా మాత్రమే కాదు, సంకల్ప వేదికలుగా మారాలి. మార్చుకోవాలి. నవంబరు 14 బాలల పండుగ. బాలలకు బంగారు ప్రపంచాన్ని ఉత్సాహంగా, ఆనందంగా జీవించగలిగే సమాజాన్ని అందించేందుకు కార్యాచరణకు అడుగు వెయ్యాలి. ఇవి తక్షణ కర్తవ్యాలుగా అమలుకు పూనుకోవాలి.
      దిగ్విజయంగా, ఫలప్రదంగా జరిగిన ఈ మహాసభలు 75 సంవత్సరాల వజ్రోత్సవాల సభగా జరగడం మరో ప్రత్యేకత. అన్ని జిల్లాల నుండి ప్రాతినిధ్యంతో 55 మందితో రాష్ట్ర కమిటీని మహాసభలు ఎన్నుకున్నాయి. ఎన్నికైన రాష్ట్ర మహిళా సంఘం నూతన కమిటీ పైలక్ష్యాల సాధనలో నాయకత్వం వహించనున్నది.

/ వ్యాసకర్త : ఐద్వా రాష్ట్ర కార్యదర్శి /
డి. రమాదేవి

డి. రమాదేవి