నేనున్నంతవరకు
నాకు తెలియదు
కట్టి మొద్దు అగ్ని(తో)
తనువుకు చాలా
బంధం ఉందని.
ఎవరో అన్నారు కానీ
నేను నమ్మలేదు
నాకు వచ్చినప్పుడు
తెలిసింది..
ఆత్మగా చూసినా
ప్రయోజనం లేదుగా
ఇది అంతా
జగన్నాటకం...
సృష్టి మొత్తం
నాటక ప్రపంచమని
తెలియదు..
పడిగాపులు
కాచే జీవితాలు
మనవి
ఎందుకు
మాట మాటకు
పోట్లాటలు,
పని చేస్తేనే ఆ రోజుకి
ఆహారం తీరిందనుకుంటాము
నేనున్నంతవరకు
తెలీదు జీవితం అంటే
ఒక ప్రదర్శన లాంటిదని..
ఎవరైన ఉన్నప్పుడు
పలకరించరు తనువు
మనతో లేనప్పుడు
ఏడుపులు,
వావోపులు ఇవన్ని
నాకు వద్దు అసలే
నా మనస్సు చిన్నది
కాస్త వచ్చిన వల్లనైనా
పలకరించండి..
వెళ్లొస్తాను స్నేహమా
(ఈ) ప్రదర్శన, జీవనం చాలు
ప్రకృతిని వ్యర్థ
పదార్థాలతో నింపేస్తున్నారు
కాస్త నిషేధించండి..
నేను వెళ్ళాను
మీ హృదయాలలో
గలిగుంటాను
స్వస్థలంలో ప్రకృతిగా
వ్యాపిస్తాను....
గిద్దలూరు సాయి కిషోర్
76708 28473