ఇంటర్నెట్‌డెస్క్ : ఉరుకుల పరుగుల జీవితంలో.. జీవన శైలిలో చాలా మార్పులొచ్చాయి. ప్రధానంగా ఆహారం విషయంలోనే తీసుకుంటే.. ఎక్కువమంది బ్రేక్‌ఫాస్ట్‌లో టిఫిన్స్‌కు బదులు కార్న్‌ఫ్లేక్స్‌ను తీసుకుంటున్నారు. దీంతో పలు అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. కార్న్‌ఫ్లేక్స్‌ను ప్రతిరోజూ తింటే కాలేయం దెబ్బతింటుందని పరిశోధనల్లో కూడా తేలింది. ఇంకా ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాలంటే.. ఇంగ్లండ్‌లోని క్రిస్ కిర్క్ అనే వ్యక్తి ఉద్యోగ బాధ్యతలరీత్యా.. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతిరోజూ రెండు గిన్నెలు చొప్పున కార్న్‌ఫ్లేక్స్ తినేవాడట. దీంతో తనకు తెలియకుండానే బరువు పెరిగాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అతను అనారోగ్యంపాలైన తర్వాత వైద్యున్ని సంప్రదించగా.. పరీల్లో కాలేయం దెబ్బతిన్నదని వైద్యులు నిర్థారించి కిర్క్‌కు తెలిపారు. ఆ సమయంలో వైద్యులు 'రోజూ ఆహారంలో భాగంగా మీరేమి తీసుకుంటున్నారు అని అడగ్గా.. తాను రోజూ ఉదయం కార్న్‌ఫ్లేక్స్‌ను తిన్నాను అని కిర్క్ బదులిచ్చారు. 'కార్న్‌ఫ్లేక్స్ వల్ల బరువు పెరుగుతారు. శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ స్థాయిలో మోతాదుకు మించి ఐరన్ మీ శరీరంలో చేరి కాలేయం పూర్తిగా దెబ్బతింది' అని వైద్యులు చెప్పారట. అయితే వైద్యుల సలహాలు, సూచనల మేరకు ఆకుకూరలు, తృణధాన్యాల్ని తీసుకుని క్రిస్ కిర్క్ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారట. ఇలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు... ఏకంగా ఐదారేళ్లు పట్టిందట క్రిస్‌కి.
కార్న్‌ఫ్లేక్స్‌ని ఇష్టంగా తినేవారు.. తప్పనిసరిగా వైద్యుల సూచన మేరకు.. తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.