Nov 17,2022 17:14

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. కొన్ని ప్రత్యేకమైన పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేమి ఫ్రూట్స్‌నో తెలుసుకుందామా..?!

ఆరెంజ్‌ : ఆరెంజ్‌లో విటమిన్‌ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడంలో ఆరెంజ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే శీతాకాలంలో రోజూ ఆరెంజ్‌ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

jama


జామ : జామపండులో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు వ్యాధికారక ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుండి కాపాడతాయి. పైగా జామలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.
దానిమ్మ : ఈ పండులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో దానిమ్మపండు తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దానిమ్మపండు తింటే రక్తపు పరిమాణం కూడా పెరుగుతుంది.

danimma