ఇంటర్నెట్‌డెస్క్ : నేటి జీవన శైలి కారణంగా చాలామంది డిప్రెషన్‌కి గురవుతున్నారు. డిప్రెషన్‌ను తగ్గించుకోవడానికి చాలామంది మందులు వాడుతున్నారు. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ తగ్గాలంటే.. వ్యాయామం తప్పనిసరి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటే డిప్రెషన్ నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!
గుడ్డు : గుడ్డులో బి 12 గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది.
వాల్‌నట్స్ : వాల్‌నట్స్ తీసుకుంటే.. డిప్రెషన్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మెదడు ఆరోగ్యానికి వాల్‌నట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఆకుకూరలు కూడా డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం బాగా పనిచేస్తాయి. పాలకూరను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి మెదడు ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. దీనివల్ల కొంత డిప్రెషన్ తగ్గుతుంది.
ద్రాక్ష : ఒత్తిడి, డిప్రెషన్ తగ్గాలంటే ద్రాక్ష పండ్లను తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే బాదంపప్పులను నీళ్లలో నానబెట్టి వాటి పొట్టు తీసి తినడం వల్ల కూడా డిప్రెషన్ తగ్గుతుంది. జీడిపప్పు కూడా మెదడు ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది.