Dec 31,2022 11:27

మలబద్ధక సమస్య నివారణకు ప్రతిరోజూ ఏదోఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆ సమస్యను నివారించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా..!

త్రిఫల పొడి
త్రిఫల పొడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు టీ స్పూన్‌ త్రిఫల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే మలబద్దక సమస్య దరిచేరదు.

dry grapes


ఎండుద్రాక్ష
ఒక పాత్రలో ఒక కప్పు నీరు పోసి 20-25 ఎండు ద్రాక్షలను వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని తాగి నానిన ఎండుద్రాక్షను తింటే మలబద్ధకం త్వరగా నయమవుతుంది.

452


జామకాయ
జామకాయలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఊపిరితిత్తులు, ప్రేగులలో శ్లేష్మం చేరకుండా ఈ పండు సహాయపడుతుంది. రోజూ రాత్రిపూట జామ పండు తినడం అలవాటు చేసుకున్న వారు మలబద్ధకం సమస్య నుండి త్వరగా బయటపడతారు.

anjeer


అంజీర్‌
ఎండిన అత్తి పండ్లలో ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతుంది. ఒక గ్లాసు పాలలో నాలుగు అత్తి పండ్లను వేసి బాగా మరిగించాలి. రాత్రి పడుకునే ముందు ఈ పాలను ఒక గ్లాసు తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆకుకూరలు
ప్రతిరోజూ ఒక గ్లాసు పాలకూరను గ్రైండ్‌ చేసి ఆ రసాన్ని సమపాళ్లలో వేసి అందులో నిమ్మరసం కలిపి రుచి చూసుకుని తాగితే అతి త్వరలో మలబద్ధకం సమస్య తీరుతుంది.

bachalakoora