Oct 03,2022 16:57

మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మెదడు పనితీరు బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అదే మానసిక సమస్యలతో బాధపడేవారు తరచూ అనారోగ్యపాలవుతుంటారు. మరి మానసిక ఆరోగ్యం బాగుండాలంటే వేటిని తినాలి? రోజూ ఆహారంలో ఏం చేర్చుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం..!

అరటిపండ్లు
రోజూ అరటిపండ్లను తింటే మీరు మానసిక ఒత్తిడి నుంచి దూరమవుతారని వైద్యులు చెబుతున్నారు. అరటిపండ్లు, వాల్‌నట్స్‌, ఆప్రికాట్లు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం మానసిక సమస్యలను దూరం చేయడానికి దోహదపడుతుంది. అందుకే మెగ్నీషియం ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల ఆందోళన, భయం, చిరాకు వంటివి మీ దరికి చేరవు. మానసికంగా దృఢంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

mg


బి విటమిన్‌ ఫుడ్‌
విటమిన్‌ బి పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని మానసిక నిపుణులు చెబుతున్నారు. వేరుశనగలు, ఫిష్‌, చికెన్‌, చిక్కుళ్లు, ఆకుకూరలు తరచూ తీసుకోవడం వల్ల మానసిక సమస్యల్ని తగ్గించుకోవచ్చు.

విటమిన్‌ డి కీలకం
మానసిక రుగ్మతలకు విటమిన్‌ డి లోపమే ప్రధాన కారణమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, పాలు, ఛీజ్‌, బఠానీలు, ఫిష్‌ వంటి వాటిల్లో విటమిన్‌ డి ఉంటుంది. తప్పనిసరిగా విటమిన్‌ డి ఉన్న పదార్థాల్ని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

vitamin d