Nov 25,2022 13:29

చలికాలంలో గర్భిణీలు సరైన ఆహారం తీసుకోరు. దీనివల్ల పిండ అభివృద్ధి కూడా.. సరిగ్గా జరగదు. అందుకే వైద్యులు తప్పనిసరిగా రోజూ పెరుగు, గుడ్డు, ద్రాక్ష వంటివాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

పెరుగు : పెరుగులో కాల్షియం ఉంటుంది. అలాగే పాలల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కడుపునొప్పి, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. గర్భిణీలు రోజూ పెరుగు తీసుకుంటే కడుపునొప్పి వంటి సమస్యలు రావు.

curd


గుడ్డు : గుడ్డులో విటమిన్‌ బి 12, డి ఉంటాయి. ఇవి శిశువు ఎముక, కండరాల అభివృద్ధిలో సహాయపడతాయి.

eggs


నట్స్‌ : వాల్‌నట్‌లు, బాదంపప్పులు, జీడిపప్పులు, ఖర్జూరాల్లో ఐరన్‌ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే డ్రైఫ్రూట్స్‌లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలు డ్రైఫ్రూట్స్‌ని తీసుకోవడం వల్ల శిశువు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

nuts


ద్రాక్ష : నల్లని ద్రాక్షలో విటమిన్‌ సి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

grapes