Aug 09,2023 14:46

అమరావతి : కొండెక్కెన టమాట ధర క్రమేపి కిందకు దిగి వస్తుంది. రెండు నెలలుగా ధర పెరుగుదలతో నోటిని కట్టేసిన టమాట ప్రియులకు ఊరట లభిస్తుంది. టమాట అత్యధికంగా సాగయ్యే ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాట ధర తగ్గుముఖం పడుతుంది. తాజాగా బుధవారం కిలో ధర రూ.90 పలికింది . అత్యధికంగా ధర కిలో రూ.128 లు పలికింది .పలెమనూర్‌ మార్కెట్లో కిలో టమాట ధర రూ. 97, గుర్రంకొండ మార్కెట్లో రూ.92, కలికిరిలో రూ.87లకు విక్రయించారు. తెలంగాణలోనూ నిన్న మొన్నటి వరకు రూ.150 లున్న ధర నేడు బహిరంగ మార్కెట్లో రూ.120 కిలోకు విక్రయించారు. ఆరుగాలం పండే టమాట దాదాపు అన్ని రకాల కూరల్లోనూ విరివిగా వాడుతుండడంతో వాటిని ఎక్కువగా ఇష్టపడే వారు టమాట ధరలు తగ్గుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.