Sitaram Yechury : ప్రతిపక్షాలు 'భారత్'ని సృష్టిస్తే.. బిజెపి దాన్ని కూడా మారుస్తుందా? : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల కూటమి పేరు 'ఇండియా'గా ఉన్నదనే.. దేశం పేరును 'భారత్'గా మోడీ ప్రభుత్వం మార్చిందని సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పలువురి రాజకీయ నేతలకు రాష్ట్రపతి భవన్ 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో ఈ శిఖరాగ్ర సమావేశ విందుకు ఆహ్వానించింది. నేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో 'ఇండియా'గా ఉన్న పేరు 'భారత్'గా మార్చడంపై కాంగ్రెస్ నేతలు, పలువురు రాజకీయ నేతలు మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పు గురించి సీతారాం ఏచూరి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రతిపక్షాల కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరు నుంచే 'భారత్'ని మోడీ ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ 'భారత్' అనే పదాన్ని సృష్టిస్తే మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అని సీతారాం ఏచూరి ప్రశ్నించారు.
'రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్‌లో 'భారత్' అనే పదం భారతదేశం.. రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది' అని చెబుతోంది. ఇది ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఇండియన్ సైన్సెస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.. ఐఐటి, ఐఐఎం వీటన్నింటిలోనూ భారత్ ఉంది. ఇది ఇప్పటివరకు ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగానే ఉంది. దాన్ని 'భారత్'గా మార్చడం వెనుక ఉద్దేశమేంటన్నది ప్రశ్నార్థకమే. ప్రతిపక్ష పార్టీలు, లౌకిక శక్తులు 'ఇండియా' పేరుతో ఒక్కటయ్యాయి. ఈ ఐక్యతను 'ఇండియా' పేరును తట్టుకోలేకనే బిజెపి రెచ్చిపోయి 'భారత్' పేరుని సృష్టించింది.' అని సీతారాం ఏచూరి మీడియాతో అన్నారు.










