ప్రజాశక్తి -నందిగామ (ఎన్‌టిఆర్) : సిఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో వైసిపి పార్టీ మండల బూత్ కన్వీనర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అరుణ్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టిడిపి భూస్థాపితం చేయడానికి వైసిపి శ్రేణులు సిద్ధం కావాలన్నారు. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాలు తిప్పికొట్టేలా ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో బూత్ కన్వీనర్లు బాధ్యత వహించాలని సూచించారు. అదేవిధంగా రానున్న సార్వత్రా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల లిస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి ,మండల పార్టీ కన్వీనర్ నెలకుదిటి శివ నాగేశ్వరరావు ,ఎంపీపీ అరిగెల సుందరమ్మ ,వైస్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు (రంగా) , గ్రామ సర్పంచ్ రవికిరణ్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి ,చలమల మధు , ఐలపాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు .










