Sep 24,2022 09:01

ప్రజాశక్తి-గన్నవరం : విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో జరిగే ' దేశ రక్షణ భేరి ' బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఏచూరి ఢిల్లీ నుండి విమానాశ్రయంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జయరామ్‌ స్వాగతం పలికారు. అనంతరం ఏచూరి కారులో విజయవాడకు వెళ్లారు.