Jul 16,2023 08:46

ఈ ప్రాంతానికి 1950లలో మొదట రైతులు వచ్చారు. ఏడాది పొడవునా పచ్చని మొక్కలతో ఉండటంతో ఈ ప్రదేశానికి ''మోంటెవెర్డే గ్రీన్‌ మౌంటైన్‌ అంటే ఆకుపచ్చని పర్వతం'' అని పేరు పెట్టారు క్వేకర్లు. మోంటెవర్డే అనేది కోస్టారికన్‌ రిజర్వ్‌, ఇది పుంటారెనాస్‌, అలజులా ప్రావిన్సులోని కార్డిల్లెరా డి టిలారాన్‌ వెంట ఉంది. సమీపంలోని మోంటెవర్డే పట్టణం పేరునే ఈ ప్రాంతానికి పెట్టారు. దీన్ని 1972లో స్థాపించారు. రిజర్వ్‌ 10,500 హెక్టార్ల (26వేల ఎకరాలు) క్లౌడ్‌ ఫారెస్ట్‌ను కలిగి ఉంది. ఈ ప్రాంతానికి ఏడాదికి దాదాపు 70 వేల మంది సందర్శకులు వస్తున్నారంటే ఎంతగా ఇది పర్యాటకుల్ని ఆకట్టుకుంటుందో చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఆకుపచ్చదనం ఫలితంగా ఆరు పర్యావరణ మండలాలు ఉన్నాయి. వీటిలో 90% సహజ అటవీ ప్రాంతం. అధిక జీవవైవిధ్యం, 2,500 కంటే ఎక్కువగా వృక్ష జాతులు (ఒకేచోట అత్యధిక ఆర్చిడ్‌ జాతులతో సహా), 100 రకాల క్షీరదాలు, 400 పక్షి జాతులు, 120 సరీసృపాలు, ఉభయచర జాతులు, వేలాది కీటకాలు ఉన్నాయి. ఇవన్నీ శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించాయి. 161 జాతుల ఉభయచరాలు, సరీసృపాలతో ఈ ప్రాంతంలోని హెర్పెటోఫౌనాగా గుర్తింపు పొందింది. 1989లో కనుమరుగైన ఒక జాతి గోల్డెన్‌ టోడ్‌ (ఇన్సిలియస్‌ పెరిగ్లెనెస్‌) నివాసంగా మోంటెవర్డే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.. మోంటెవర్డే 91 (21%) పక్షి జాతులతో సుదూర వలస పక్షులకు ఆవాసం. ఇవి ఉత్తర అమెరికాలో పునరుత్పత్తి చేస్తాయి. వాటి వలస సమయంలో మోంటెవర్డే గుండా వెళతాయి. ఒక్కోసారి శీతాకాలంలో ఈ ప్రాంతంలోనే గడుపుతాయి.

1

 

2

 

4

 

6

 

6