Jul 25,2023 21:05
  • అందుకే ఎక్స్‌గా పేరు మార్చాం : ఎలన్‌ మస్క్‌ వెల్లడి

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌ను భవిష్యత్తులో సూపర్‌ యాప్‌గా మార్చాలనే లక్ష్యంతోనే ఎక్స్‌గా పేరు మార్చామని ఆ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు. ట్విట్టర్‌ పేరు మార్పునపై రెండు రోజుల తర్వాత ఆయన స్పందించారు. వచ్చేకొన్ని నెలల్లో ఎక్స్‌లో కీలక మార్పులు రానున్నాయన్నారు. వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. ఎక్స్‌ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చబోతున్నామన్నారు. ఇప్పటికే పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ''వాక్‌ స్వాతంత్య్రానికి గుర్తుగా ట్విటర్‌ను మార్చాలని ఎక్స్‌ కార్పొరేషన్‌ దాన్ని కొనుగోలు చేసింది. అందులో భాగంగానే ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చాం. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విటర్‌ అనే పేరు సరిపోతుంది. కానీ, ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఎక్స్‌లో ట్వీట్‌లు మాత్రమే కాదు అధిక నిడివి వీడియోలు కూడా పంచుకోవచ్చు.'' అని ఎలన్‌ మస్క్‌ పేర్కొన్నారు.