Sep 26,2023 08:01
  • 2019 నుండి బడ్జెట్‌ సహకారం లేదు
  • అభివృద్ధి ప్రణాళికలో అనిశ్చితి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాగ్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భూ సమీకరణ కోసం చేసిన వేల కోట్ల రూపాయల ఖర్చు నిరుపయోగంగా మారిందని, ఇప్పటికే వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు నిష్సలంగా మారాయని పేర్కొంది ఈ మేరకు కాగ్‌ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు శాసనసభలో ప్రవేశపెట్టింది. '2019నుండి అమరావతికి బడ్జెట్‌ సహకారం లేదు' అని ఈ నివేదికలో కాగ్‌ నిర్ధారించింది. 'రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు కారణంగా 55 ప్యాకేజిలపై అనిశ్చితి నెలకొంది' అని పేర్కొంది. 2019 నురచి నిర్ణయించిన ప్రణాళిక కోసం కనీసం బడ్జెట్‌ సహకారం అందించేందుకు కూడా ప్రయత్నం జరగలేదని కాగ్‌ పేర్కొంది. 33,476 కోట్లు రుణంగా సమీకరించుకోవాల్సి ఉండగా, కేవలం 8,540 కోట్లు మాత్రమే సమీకరించుకు న్నారని పేర్కొంది. ప్రభుత్వ విధానం మారిన ఫలితంగా 2019 నుంచి కాలపరిమితి లేకుండా ఉన్న 55 ప్యాకేజిల ఒప్పందాలపై అనిశ్చితి నెలకొందని వ్యాఖ్యానించింది. ఈ 55 ప్యాకేజి పనులు పూర్తి చేసేందుకు 28,048 కోట్లు కావాల్సి ఉందని పేర్కొంది. వీటి భూసమీకరణకు 2,245 కోట్ల రూపాయలు సిఆర్‌డిఎ వ్యయం చేసిందని, ఇలా సేకరించిన భూమి అంతా నిరుపయోగంగా పడి ఉందని విమర్శించింది. సమీకరించిన భూమిలో మౌళికాభివృద్ధి కోసం రూ.13,803 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం 183 కోట్లు మాత్రమే అక్టోబర్‌ 2021 వరకు ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు కాగ్‌ వెల్లడించింది. దీంతో 2021 సెప్టెంబర్‌ వరకు 16 ప్యాకేజిల్లో నాలుగు ప్యాకేజిల్లో కేవలం 10 నుంచి 18 శాతం పురోగతి ఉన్నట్లు పేర్కొంది. మరో 12 ప్యాకేజిలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని పేర్కొంది.
 

                                                                   నిధుల వ్యయంచేసినా...

అనేక ప్యాకేజిల్లో రూ. 3,213 కోట్లు వ్యయం చేసినా ఆ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని కాగ్‌ ఆక్షేపించింది. మరో రూ. 270 కోట్లతో పైపులు కొనుగోలు చేసినా అవి నిరుపయోగంగా పడి ఉన్నాయని, దీంతో ఆ వ్యయం నిష్ఫలమైందని కాగ్‌ ఆక్షేపించింది. రహదారుల నిర్మాణంలోనూ నిష్ఫల వ్యయం కనిపించిందిని కాగ్‌ ఆరోపించింది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రహదారిని భవిష్యత్తు ట్రాఫిక్‌కు అనుగుణంగా తొమ్మిది లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని భావించి విస్తరణ పనులు ప్రారంభించారని, అయితే భూసేకణ సమస్య కారణంగా 44 కోట్లు వ్యయం అనాలోచితంగా చేసినట్టయిందని కాగ్‌ పేర్కొంది. ప్రభుత్వ భవనాలకు సంబంధించి 19 ప్యాకేజిల్లో 6,848 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం రెండు ప్యాకేజిల్లో 527 కోట్లుతో పనులు పూర్తయ్యా యని, మిగిలిన 17 ప్యాకేజిల్లో 1,505 కోట్లు వ్యయం చేశారని, అవి పూర్తి కాలేదని కాగ్‌ పేర్కొంది.
 

                                                                        అంతా సందిగ్ధమే

2019 నుంచి అన్ని ప్యాకేజిల పనులు నిలిచిపోవడంతో వాటి పురోగతిపై సందిగ్ధం నెలకొందని కాగ్‌ అభిప్రాయపడింది. ఫలితంగా అప్పటివరకు ఖర్చు చేసిన 1,505 కోట్ల రూపాయల నిధులు కూడా నిరుపయోగమయ్యాయని కాగ్‌ విమర్శిరచింది. అలాగే అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ పనులకు 208 కోట్లుతో కొనుగోలు చేసిన సామగ్రి కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. మరికొన్ని పనుల్లో కూడా కోట్లాది రూపాయలు వృధాగా మారిపోయాయని కాగ్‌ ఆక్షేపించింది.2019 నుంచి నిర్ణయించిన ప్రణాలిక కోసం కనీసం బడ్జెట్‌ సహకారం అందించేందుకు కూడా ప్రయత్నించలేదని కాగ్‌ పేర్కొంది. 33,476 కోట్లు రుణంగా సమీకరించుకోవాల్సి ఉండగా, కేవలం 8,540 కోట్లు మాత్రమే సమీకరించుకున్నారని పేర్కొంది.
 

                                                                           ప్యాకేజిలపై అనిశ్చితి
అమరావతి రాజధాని నిర్మాణంలో ప్యాకేజిలపై ఇంకా అనిశ్చితి నెలకొందని పేర్కొంది. 2019 నుంచి కాలపరిమితి లేకుండా ఉన్న 55 ప్యాకేజిల ఒప్పందాలపై అనిశ్చితి పెరుగుతోందని వ్యాఖ్యానించింది. ఈ 55 ప్యాకేజి పనులు పూర్తి చేసేందుకు 28,048 కోట్లు కావాల్సి ఉందని పేర్కొంది. వీటి భూసమీకరణకు 2,245 కోట్లు క్రిడా వ్యయం చేసిందని, ఇలా సేకరించిన భూమి అంతా నిరుపయోగంగా పడి ఉందని అభిసంశించింది. సమీకరించిన భూమిలో మౌళికాభివృద్ధి కోసం 13,803 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం 183 కోట్లు మాత్రమే అక్టోబర్‌ 2021 వరకు ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు కాగ్‌ వెల్లడించింది. దీంతో 2021 సెప్టెంబర్‌ వరకు 16 ప్యాకేజిల్లో నాలుగు ప్యాకేజిల్లో కేవలం 10 నుంచి 18 శాతం పురోగతి సాధించినట్లు కాగ్‌ వెల్లడించింది. మరో 12 ప్యాకేజిలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని పేర్కొంది.

                                                                          గత ప్రభుత్వంలోనూ...

అమరావతి నిర్మాణానికి సంబంధించి గత టిడిపి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కాగ్‌ తప్పు పట్టింది. రాజధానికి అవసరమైన భూమిలో 70 శాతాన్ని భూసమీకరణ ద్వారా సేకరించాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయం కారణంగా రానున్న కాలంలో భారీ ఆర్థిక భారం పడనుందని కాగ్‌ పేర్కొంది. మాస్టర్‌ ప్లాన్‌ తయారీలో కూడా కన్సల్టెంట్లను నామినేషన్‌ పద్ధతిలో ఎంపిక చేయడాన్ని కూడా ప్రస్తావించింది. అందుకే స్పష్టమైన ఆర్ధిక ప్రణాళికలు లేకుండా 33,476 కోట్లతో సిఆర్‌డిఎ, ఎడిసిఎల్‌లు అనేక ప్యాకేజిలకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని పేర్కొంది. ఫలితంగా 2016 నుంచి 2023 వరకు 55,343 కోట్లు అవసరం కాగా, అన్ని ఆర్థిక వనరుల నుంచి కేవలం 11,487 కోట్లు మాత్రమే సమీకరించుకోగలిగారని వివరించింది.