శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానంలో వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలుడు సంభవించింది. మంగళవారం ఉదయం నిత్యాన్నదానం బయటవైపు ఉన్న బాయిలర్ పేలడంతో పెను ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుతో భక్తులంతా భయంతో పరుగులు తీశారు. వేడి ఎక్కువవడంతో ఒత్తిడి పెరిగి బాయిలర్ పేలినట్లు దేవస్థాన సిబ్బంది భావిస్తున్నారు.