ప్రజాశక్తి-కాకినాడ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ జోడోయాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం కాకినాడలో నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పిసిసి సభ్యుడు ఆకుల వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ.. తమ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జోడోయాత్ర చేపట్టి సెప్టెంబర్ 7 గురువారం నాటికి ఏడాది పూర్తయినదన్నారు. ఆయన పాదయాత్ర దేశంలో వివిధ రాష్ట్రాల్లో సుమారు 722 జిల్లాల్లో ఈ యాత్ర విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం కాకినాడ భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్, జగన్నాధపురం బ్రిడ్జి, మున్సబ్ జంక్షన్ వరకు నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని దీనికి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. ఈ యాత్రలో నాయకులు, కార్యకర్తలు ఇతర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆకుల వెంకటరమణ పిలుపునిచ్చారు.










