ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ (కాకినాడ) : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లులో భాగంగా సామర్లకోట జగనన్న లేఔట్‌లో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా జగనన్న లేఔట్‌లలో అభివృద్ధి పనులను మౌలిక వసతి పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దవులూరి దొరబాబుతో కలిసి జగనన్న లేఔట్‌లో పనులను పరిశీలించారు. కాలనీలో జరుగుతున్న మౌలిక వసతి పనులను, ఇళ్ల నిర్మాణ పనులు తదితర అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును దొరబాబు చంద్రశేఖర్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజేస్, కాకినాడ సిటీ వైసీపీ అధ్యక్షురాలు సుంకర లక్ష్మీప్రసన్న, తదితరులు పాల్గొన్నారు










