ఇంటర్నెట్‌డెస్క్ : పిల్లలు, పెద్దలు బ్రెడ్‌ని ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ.. ఈవినింగ్ స్నాక్స్‌లో చాలామంది బ్రెడ్‌ని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉన్నవారే కాదు.. అనారోగ్యానికి గురైన పేషెంట్లు కూడా బ్రెడ్‌ని తింటేనే త్వరగా కోలుకుంటారు. అయితే బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. మార్కెట్లో దొరికే బ్రౌన్ కలర్ బ్రెడ్‌ని తీసుకోకుండా ఉంటేనే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
- ఇంట్లో గోధుమ పిండితో తయారుచేసే బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- మార్కెట్లో బ్రెడ్ కొనేటప్పుడు.. ఆ ప్యాకేజీపై బ్రెడ్ తయారీకి ఉపయోగించిన పదార్థాలను పరిశీలించాలి. బ్రెడ్ తయారై ఎన్నిరోజులవుతుందో చెక్ చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
- లోకల్ బేకరీల్లో తయారయ్యే బ్రెడ్ ప్యాకెట్‌ని కొనేటప్పుడు కూడా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెడ్ తాజాగా కనిపించేందుకు రంగులు వాడతారని, అవి ఆరోగ్యానికి హానికరం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.