పట్నపు అద్దంలో ముస్తాబవుతున్న గ్రామాలు
నగరపు సోకులు సంతరించుకుంటూ
యాసా భాషా మార్చుకుంటూ కొత్త పుంతలు
మట్టిని కదిలిస్తూ కత్రిమ సువాసనలు వెదజల్లే..
పచ్చని ప్రకతి మధ్య తేలియాడే సూర్యుడు
అపార్ట్మెంట్లలో నిద్రలేస్తున్నాడు ఇప్పుడు
పచ్చని చెట్ల మధ్య తాండవించే కిరణాలు
కాంక్రీట్ సొగసుల్లో తోడు లేక తిరుగుతుంటాడు..
పెరటి బావి నీళ్లు టెంకాయ రుచులు కోల్పోయే
మినరల్ నీళ్లు తాగి సచ్చువడి పోతుంటే
నాగరికత మోజుతో శీతల పానీయాలు స్వీకరిస్తే
పూర్ణాయువు అర్ధాంతరంగా ముగిసింది..
ప్రకతిని మురిపించే గ్రామ సీమలు
తెగిపడ్డ మొండాల్లా నేల పై తిరుగుతున్నాయి
కల్మషం లేని స్వచ్ఛమైన మాటలు పోయే
జ్ఞాపకాల జైల్లో బందీల నిలబడిపోయే..
స్వచ్ఛమైన అమృతం తాగి ఆరోగ్యమైన పల్లెలు
నేడు ఒళ్లంతా పుండ్లు చేసుకొని గిలగిలలాడే
చిత్రకారుడు కుంచె నుంచి జాలువారిన సోపానాలు
వర్ణ కాంతి దూరమై జీవం కోల్పోయింది..
పెరటి పువ్వుల సువాసనలు వెదజల్లుతూ
ఇంటి ముందర నాదస్వర కచేరి వినిపించే
ప్లాస్టిక్ పువ్వుల అలంకరణతో కాంతి హీనంగా
కృత్రిమ శ్వాసతో అంపశయ్యపై ఉన్నట్టుంది..
గలగల కల్మషం లేకుండా మాట్లాడే జనాలు
వీధి అరుగుమీద తరగని ఆస్తిగా కూర్చుంటే
నేడు సెల్‌ఫోన్ల మాయాజాలంతో కనిపించే
నలుగురిలో ఎవరికి ఎవరు కానట్లు ఉంటున్నారు..
కొప్పుల ప్రసాద్
9885066235