Oct 22,2023 14:27

హైదరాబాద్‌ : నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం చిత్తనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రో ఇథనాల్‌ కంపెనీ వ్యర్థాల తరలింపుపై వివాదం నెలకొంది. వ్యర్థాల తరలింపును చిత్తనూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఆగ్రహంతో గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మక్తల్‌ సీఐ రామ్‌లాకు గాయాలయ్యాయి.