Oct 28,2023 15:59

న్యూఢిల్లీ: ముసుగు ధరించిన వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఒక మహిళపై గన్స్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. కాల్పుల శబ్దం విన్న పొరుగువారు ఆ దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్‌ వదిలి పారిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జైత్‌పూర్‌ ప్రాంతంలోని ఒక ఇంట్లోకి ముసుగులు ధరించిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. ఆ ఇంట్లో నివసిస్తున్న 24 ఏళ్ల పూజా యాదవ్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు.