Oct 18,2023 09:19

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విలేజ్‌ వార్డు సెక్రటరీలకు జాయింట్‌ సబ్‌రిజిస్టార్లుగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 సెక్షన్‌ 6 ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహార్‌ రెడ్డి మంగళవారం గెజిట్‌ జారీ చేశారు. వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఇందులో పేర్కొన్నారు. పంచాయితీ కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శులుగా పని చేస్తున్న వారికి ఈ అవకాశం కల్పించారు. వీరికి రిజిస్ట్రేషన్‌ సమయంలో డిజిటల్‌ అసిస్టెంట్లు సహకరించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,526 మందికి ఈ బాధ్యతలు అప్పగించారు.