
విజయ్ దేవరకొండ వరుసగా రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పరశురామ్‌తో ఓ చిత్రం చేస్తూనే.. మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండూ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. వీటి తర్వాత దిల్ రాజు నిర్మాణంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. దీన్ని రవికిరణ్ కోలా తెరకెక్కించనున్నారు. 1980ల నేపథ్యంలో సాగే మాఫియా కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో టైటిల్‌తో పాటు మిగతా వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారు.