Aug 27,2023 08:38

పూర్వం వీధులు వ్యక్తుల పేర్లతో ఉండేవి
అందరికీ తెల్సిన పేర్లవి
దేశం కోసం చనిపోయిన వాళ్ళవి
పేదలకు వైద్యం చేసిన వాళ్ళవి
సూచీకలుగా ఉండేవి
ఆ తర్వాత కూడా ఉండేవి
ఎవరు ఎక్కువ డబ్బిస్తే వాళ్ళవి
ఎవరి కులానికి చెందిన వాళ్ళవి
ఆయా రంగుల వర్ణాల వర్గాలుగా
మారిపోయి ఉండేవి
పాపం పోస్టుమ్యాన్‌లు
ఎవరైనా కొత్త చుట్టాలు
ఆ పేర్లు నోరు తిరక్క
తెగ ఇబ్బంది పడేవాళ్ళు
ఇప్పుడు
రోడ్లు ఉన్నాయి
అక్కడే వరసలు వరసలుగా ఇళ్ళూ
పేర్లు పాతబడి పోయాయి
చిరునామాలన్నీ కొత్తగా మారిపోయి
మెట్రో స్టేషన్‌ నుంచి నేరుగా
మెట్రో పిల్లర్‌ నుంచి రెండో లైనుగా
రూపాంతరం చెందాయి
మనుషులు పాతబడిపోయిన తర్వాత
ఇంకా వాళ్ళతో ఏం పని
మార్కెట్‌ సుఖవంతంగా లాలిస్తుంటే
నడిపించే వాటితో భర్తీ చేయడమే కదా వర్తమానం
కాంక్రీట్‌ అరణ్యంలో మానులే నడిపిస్తాయి
గమ్యం తెలియని మనం నడుస్తూ పోవడమే..

అనిల్‌ డ్యాని
9703336688