Feb 07,2023 15:12

కారకాస్‌  :  వెనెజులాలో అక్రమ మైనింగ్‌ వలన ప్రభావితమైన రెండు నేషనల్ పార్క్ ల్లో   బొలీవేరియన్‌ నేషనల్‌ ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌ (ఎఫ్‌ఎఎన్‌బి) అటవీ పునరుద్ధరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళికను అమలు చేసే మండలాలు బ్రెజిల్‌ మరియు కొలంబియా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమెజానాస్‌, బొలీవర్‌ రాష్ట్రాల్లో ఉన్నాయని ఎఫ్‌ఎఎన్‌బి పేర్కొంది. రక్షిత ప్రాంతాల్లోకి ప్రవేశించిన అక్రమ మైనింగ్‌ వలన కలిగే నష్టాలను తిరిగి పొందేందుకు మేము కనైమా నేషనల్‌ పార్క్‌లో అటవీ నిర్మూలన ప్రచారాన్నిప్రారంభించామని ఎఫ్‌ఎఎన్‌బి జనరల్‌ డొమింగో హెర్నాండేజ్‌ అన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే అక్రమ మైనింగ్‌ను తిప్పికొట్టేందుకు చేపట్టే ప్రయత్నాలన్నింటినీ ఏకం చేయాలని, అవగాహన పెంచుకోవాలని అన్నారు. కనైమా మరియు యపకానా నేషనల్‌ పార్క్స్‌ రక్షిత ప్రాంతాలని, చట్టపరమైన ప్రాదేశిక క్రమాన్ని ఉల్లంఘించే ఏదైనా నిర్మాణాన్ని ఎఫ్‌ఎఎన్‌బి కూల్చివేస్తుందని హెర్నాండేజ్‌ హెచ్చరించారు. వెనిజులా దక్షిణ సరిహద్దులో, అక్రమ మైనింగ్‌తో సుమారు 1,531 హెక్టార్లలో అటవీ నిర్మూలన జరిగిందని, వీరు సరిహద్దుల్లో అక్రమంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.