Apr 23,2023 13:33

ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. ఆదివారం వెల్లంపల్లి కుటుంబ సమేతంగా రత్నగిరి కొండపైకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ లాంఛనాలు నిర్వహించారు. అనంతరం వెల్లంపల్లి, కుటుంబ సమేతంగా సత్యదేవుని వ్రతము ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థాన అధికారులు వేద ఆశీస్సులు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఎల్‌.శ్రీనివాస్‌ రమణ, కఅష్ణ ప్రసాద్‌, ఎల్‌.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు