ఇటలీ : మెగా కుటుంబంలో హీరో వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠిల పెళ్లి సందడి ఘనంగా జరిగింది. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక ఇటలీలో టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు నాగబాబు సోదరులు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు రాంచరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్.. లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు, మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. భారత కాలమానం ప్రకారం నవంబరు 1 సాయంత్రం 07.18 గంటలకు వీరిద్దరూ వివాహ బంధంతో ఏడడుగులు వేశారు. ఈ నేపథ్యంలో పెళ్లి ముహుర్తానికి కొన్ని గంటల ముందుగా.. వరుణ్ తేజ్ పీఆర్ టీమ్ వివాహ వేడుకకు సంబంధించిన ప్రత్యేక గ్లిమ్స్‌ను మీడియాకు షేర్ చేసింది. ఇది మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక సినీ ఇండిస్టీ, ప్రముఖుల కోసం నవంబర్ 5 న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
;
>