ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, రాజకీయ నాయకుడు ఆప్ ఎంపి అయిన రాఘవ్ చద్దా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహం ఆదివారం (సెప్టెంబర్ 24) ఉదరుపూర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆప్ పార్టీ నేతలతోపాటు, పలువురు రాజకీయ నేతలు, బాలీవుడ్ ఇండిస్టీకి చెందిన పలువురు సినీ తారలు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలను పరిణితి చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.