
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని తెలిసిందే. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ పెళ్లి జరిగే వేదిక వివరాలు తెలిసాయి. రామ్‌చరణ్ భార్య ఉపాసన తన సోషల్ మీడియాలో ఇచ్చిన లీక్ ప్రకారం ఈ పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వివాహ వేడుక నిర్వహించనున్నారు. ఈ లగ్జరీ రిసార్ట్ నిజానికి ఒక చారిత్రాత్మక గ్రామం. విలేజ్ రిసార్ట్‌లోని విలాసవంతమైన విల్లాల్లో అతిథులకు బస ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయని అతిథులందరూ నాలుగు రోజులు అక్కడ ఉంటారని అంటున్నారు. పెళ్లి తేదీపై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అక్టోబర్ 30న వరుణ్, లావణ్య కుటుంబ సభ్యులు, బంధువులు ఇటలీకి వెళ్లనున్నారు. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరుకానున్నారు.