- ట్రయల్ రన్ నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు
ప్రజాశక్తి - కర్నూలు జిల్లాపరిషత్ : త్వరలో కర్నూలుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. ఈ మేరకు డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోరుతో పాటు ఆయా విభాగాల అధికారులు, సాంకేతిక సిబ్బంది ఈ రైలులో ప్రయాణించారు. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరిన ఈ రైలు 1:30 గంటలకు కర్నూలుకు చేరుకుంది. అనంతరం డోన్ వరకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్ వెళ్ళిపోయింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్పీడ్, ట్రాక్ సామర్థ్యం, సిగలింగ్ తదితర అంశాలు పరిశీలించడానికి ట్రయల్ రన్ నిర్వహించామని అధికారులు తెలిపారు.










