
శాన్‌ఫ్రాన్సిస్కో : రాబోయే రోజుల్లో గూగుల్ క్రోమ్‌లో ప్రతి ట్యాబ్ ఎంత మెమరీని ఉపయోగిస్తుందో వినియోగదారులు తెలుసుకునేలా కొత్త ఫీచర్ త్వరలో రానుంది. ఇలా మెమరీని ఎలా యూజ్ చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు క్రోమ్ కొత్త ఫీచర్‌పై దృష్టి పెట్టినట్లు క్రోమ్ నిపుణుడు లియోపెవా తన ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ కొత్త ఫీచర్‌తో మెమరీ తెలుసుకునేందుకే కాదు.. బహుళ ట్యాబ్‌లను మూసివేసేందుకు కూడా ఈ ఫీచర్ సహాయపడుతుంది. గత నెలలో మ్యాక్, విండోస్, లైనెక్స్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలు మెమరీ సేవర్ మోడ్‌లను విడుదల చేశాయి. ఈ కొత్త ఫీచర్‌తో యాక్టివ్ లేని ట్యాబ్‌ల నుండి మెమరీని ఖాళీ చేసే అవకాశం ఉంది. దీంతో ఎనర్జీ సేవర్‌తోపాటు, బ్యాక్‌గ్రౌడ్ యాక్టివిటీ, క్రోమ్ బ్యాటరీ ఎనర్జీ కూడా ఆదా అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్‌లో చివరి 15 నిమిషాల బ్రౌజింగ్ డేటాను కూడా ఈ కొత్త ఫీచర్ తొలగిస్తుంది.