
న్యూఢిల్లీ : ఈ ఏడాదిలో కొన్ని ఒడిదుడుకులున్నప్పటికీ 2030 నాటికి భారత ఇంటర్నెట్ పరిశ్రమ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఓ నివేదిక సోమవారం వెల్లడించింది. 780 మిలియన్ల వినియోగదారులతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుగా భారత్ నిలిచింది. డిజిటల్‌గా ఇంటర్నెట్ కీలకపాత్ర పోషిస్తున్నది. 2030 నాటికి భారతదేశ ఇంటర్నెట్ విలువ సుమారు 1 ట్రిలియన్‌కి పెరుగుతుంది.. అది పబ్లిక్ అండ్ ప్రైవేట్ మార్కెట్ (క్యాప్)లో 5 ట్రిలియన్లకు సమానమని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ పేర్కొంది. సగటు భారతీయుడు రోజుకు 7.3 గంటలు స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇంటర్నెట్ వాడకం పెరగడం వల్లే ఇంటర్నెట్ ఇండిస్టీ విలువ కూడా పెరుగుతున్నదని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. మన దేశంలో సోషల్ మీడియా యూట్యూబ్, షార్ట్ వీడియోస్‌ని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలే చూస్తున్నారని నివేదిక పేర్కొంది. అయితే ఇంటర్నెట్ ఆదాయంలో ఎక్కువశాతం వాణిజ్య ప్రకటనల ద్వారానే పెరగవచ్చని నివేదిక వెల్లడించింది.