బాపట్ల : ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బాపట్ల టౌన్ ఔటర్ రింగురోడ్డు బైపాస్‌లో మచ్చావారిపాలెం వద్ద ఫ్లైఓవర్ వంతెన పై జరిగింది. అనుమతులు లేకుండా ఇసుకను తెల్లవారుజామున తరలించే క్రమంలో ఈ సంఘటన జరిగింది.
బాపట్ల పట్టణం శివారు బైపాస్ రోడ్డులో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తిగా నిర్మాణం కాని ఈ రోడ్డులో వాహనదారులను అనుమతిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో అక్కడ అడ్డుగా ఐరన్ బారికేట్స్ ఏర్పాటు చేశారు. పగటిపూట అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అని రాత్రుల్లో ఈ భారీకేడ్లు కనిపించకుండా ఉండడంతో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి వాహనదారులు గాయాలపాలైన సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఉదయం జరిగిన ట్రాక్టరు ప్రమాదం మరోలా ఉంది. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం ఎలాంటి శిక్షణ లేకుండా వాహనాలను రోడ్లపై తేవటం డ్రైవర్ల పరిపాటిగా మారిందని, దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కోట్ల జిల్లా ఏర్పడ్డాక ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిందని స్థానికులు చెప్పారు. ప్రమాదాల నివారణకు పోలీసులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రవాణా శాఖ ఉన్నత అధికారులు నిస్పక్షపాతంగా పరిశీలించాలి చర్యలు చేపట్టాలని కోరారు.










