Aug 21,2022 12:06

కులం కత్తుల సాముచేసి
తల తెగిపడ్డ మొండాలతో
మనువుకు నైవేద్యం పెట్టండి
మతం మంటలు రాజేసి
దహించిన భస్మ ధూళితో
యజ్ఞయాగాదులు చేయండి

కులం కత్తుల సాముచేసి
తల తెగిపడ్డ మొండాలతో
మనువుకు నైవేద్యం పెట్టండి
ఆధిపత్య విషం వెళ్లగక్కి
చచ్చిన పీనుగల ఎత్తుకుని

ఆలయ ప్రదక్షిణలు చేయండి

నిరంకుశ కొరడా జులిపి
చిందిన నెత్తుటి దారలతో
కార్పొరేట్లకు హారతి పట్టండి
చీకటి చట్టాల పలుగు వేటేసి
బతుకుల నిలువునా కూల్చి
సామ్రాజ్యాలను విస్తరించండి

అధికార బలం, బలగంతో
జాతి సిరిసంపదలు కొల్లగొట్టి
దేశాన్ని స్మశానంగా మార్చండి
ఓట్లాటలో అడ్డదారిలో
గెలిచిన 'మోద్షా'లు మీరు
ఎదురన్నది లేనివారు కదా!

అందుకే ఇంకా రెచ్చిపోండి
భారతావనిని తెగ దున్నండి
కానీ ఏదో ఒకరోజు
బడుగు బలహీన గళాలు
సమర శంఖం పూరిస్తారు
కార్మిక, కర్షక, శ్రామికశక్తులు
కదం తొక్కి, కవాతు చేస్తారు

సకలజనుల పోరు పిడికిలెత్తి
కోట గోడలు బద్ధలుగొడతారు
సరిహద్దులు దాట తరుముతారు
 

కోడిగూటి తిరుపతి
95739 29493