Jul 23,2023 16:54
  • 253 మంది గైర్హాజరు 

ప్రజాశక్తి - యానాం : పుదుచ్చేరి వ్యాప్తంగా 116 యుడిసి ( అప్పర్ డివిజన్ క్లర్క్ ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష యానాంలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఎనిమిది పరీక్ష కేంద్రాలలో 2122 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవ్వాల్సి ఉండగా 1869 మంది మాత్రమే హాజరయ్యారని ఎగ్జామినేషన్ రీజనల్ అధికారి, ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి తెలిపారు. 253 మంది పరీక్షకు గైరాజరయ్యారన్నారు. పరీక్షా సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందన్నారు.