Jul 16,2023 07:32

జంతువుల మూత్రం తాగుతూ
మనుషులపై ఉచ్చ పోసే..
ఉచ్చ జాతి అది..
పోసేది ఒకరు.. కడిగేది మరొకరు..
అయితే.. పోసింది ఒకరిపై..
కాళ్ళు కడిగింది మరొకరివి..
అంతా ఉచ్చ జాతి మరి..

మూత్ర విసర్జన చేసి
కాళ్ళు కడుక్కునే పరిశుభ్రత ఏమోగానీ..
ఇప్పుడు నా దేశమంతా అదే కంపు
ఉచ్చ జాతిదేగా పెత్తనం..


పక్కనోడి బట్టలు తడిసి
మన నాసికా పుటలు బద్దలవుతున్నా..
మిన్నకుండిపోతున్నాం..
రేపు నీపైనా పోస్తాడు..
వాడిది ఉచ్చ జాతి కదా

మూత్రాన్ని యదేచ్చగా ప్రవహింపజేస్తూ..
ఉచ్చనీచాల గురించి బోధిస్తూ..
ఉచ్చ సంద్రంలో దేశభక్తి పడవపై..
మత పరదా కడుతున్నాడు..
అయినా పట్టనితనంలో మనం..

ఇప్పుడు ఆ ఉచ్చ జాతి..
పంట పొలాల్లో మూత్రం పోస్తూ..
కొండ గుట్టల్లో ఉచ్చ జలపాతాలవుతున్నారు..
ఏంచేసినా మాదే చెల్లుబాటు
అనేదే ఈ ఉచ్చ జాతి నీతి..
సిగ్గు విడిచి నగంగా
దేశమంతా ఊరేగుతుంది ఈ జాతి..

అంతా తనదే అయినప్పుడు..
నాటకం రసవత్తరంగానే కొనసాగుతుంది..
తనే నేరానికి పాల్పడుతూ..
తీర్పూ తానే లిఖిస్తాడు..

మన మధ్య అనేక అంతర కంచెలు వేసే పనిలో
ఆ జాతి ఎప్పుడూ బిజీనే
చట్ట సభల్లోనూ ఇప్పుడు అదే కంపు..
మల్లయోదులైనా స్త్రీలయితే చాలు..
తెగించిన లింగాలు వారు..
మరి ఉచ్చ జాతి కదా...
నువ్వలా చూస్తూ ఉంటే.. పోస్తూనే ఉంటారు..

శాంతిశ్రీ,
83338 18985