Dec 16,2022 12:16

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : ఉపాధ్యాయుల బదిలీ కౌన్సింగ్‌లో యుటిఎఫ్‌ నందిగామ కార్యాలయంలో ఉపాధ్యాయులకు ఉచిత సౌకర్యం కల్పించారు. శుక్రవారం యుటిఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా ట్రెజరర్‌ మహేశ్వర వెంకటేశ్వరరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. పలువురు ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ కార్యాలయంలో కౌన్సింగ్‌ ఆన్‌ లైన్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బదిలీలు ఆన్‌లైన్‌లో చేయించుకోవడానికి 17 వ తేదీ అనగా రేపటి వరకు సమయం ఉన్నదని తెలిపారు. నేడు, రేపు యుటిఎఫ్‌ నందిగామ ప్రాంతీయ కార్యాలయం, రైతు పేటలో సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఉపాధ్యాయులకు సేవలు అందిస్తామన్నారు. ఉపాధ్యాయులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మహేశ్వర వెంకటేశ్వరరావు ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు, యుటిఎఫ్‌ నాయకులు జక్కనాచార్యులు, మేదరమెట్ల కోటేశ్వరరావు, పొదిలి విజయలక్ష్మీ, దేవర శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.