- జ్వెరేవ్, మెద్వదెవ్ కూడా..
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో సంచనాలను నమోదయ్యాయి. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో టైటిల్ ఫేవరెట్‌లు 5వ సీడ్ జబీర్(ట్యునీషియా), 3వ సీడ్ పెగూలా(అమెరికా) ఓటమిపాలయ్యారు. పెగూలా 1-6, 3-6తో సహచర క్రీడాకారిణి, 17వ సీడ్ కీస్ చేతిలో, జబీర్ 2-6, 4-6తో 23వ సీడ్ జెంగ్(చైనా) చేతిలో వరుససెట్లలో ఓడారు. మరో పోటీలో 2వ సీడ్ సబలెంక(చెక్) 6-1, 6-3తో 13వ సీడ్ కసట్కినా(రష్యా)పై గెలిచింది. మంగళవారం జరిగే తొలి క్వార్టర్‌ఫైనల్లో 20వ సీడ్ ఓస్టాపెంకా(లాత్వియా).. 6వ సీడ్ కోకా గాఫ్(అమెరికా)తో తలపడనుంది.
క్వార్టర్‌ఫైనల్స్(సింగిల్స్).. మహిళలు..
సబలెంక(20) × కోకా గాఫ్(6)
సిర్నియా(30) × ముఛోవా(10)
క్యూ జెంగ్(23) × సబలెంకా(2)
వోండ్రుసోవా(9) × ఎం. కీస్(18)
పురుషులు...
ఫ్రిట్స్(9) × జకోవిచ్(2)
టఫీ(10) × షెల్టన్
మెద్వదెవ్(3) × రుబ్లేవ్(8)
అల్కరాజ్(1) × జ్వెరేవ్(12)










