న్యూయార్క్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఎటిపి) తాజా ర్యాంకింగ్స్‌లో సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఎటిపి సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో యుఎస్ ఓపెన్ సింగిల్స్ ఛాంపియన్ జకోవిచ్ 11,795పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక వింబుల్డన్ ఛాంపియన్, స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ (8535పాయింట్లు) 2వ స్థానంలో, రష్యాకు చెందిన మెద్వదెవ్ 7280పాయింట్లు మూడోస్థానంలో నిలిచారు. ఇక పురుషుల డబుల్స్‌లో రోహన్ బొప్పన్న 7వ స్థానంలో, యుకీ బాంబ్రీ 65వ స్థానంలో నిలిచారు. సింగిల్స్‌లో సుమిత్ నాగల్(156), ముకుంద్ శశికుమార్(365వ ర్యాంక్)లో ఉన్నారు.
ఎటిపి టాప్-10 ర్యాంక్‌లు..
1. జకోవిచ్(సెర్బియా) : 11795పాయింట్లు
2. అల్కరాజ్(స్పెయిన్) : 8535 ,,
3. మెద్వదెవ్(రష్యా) : 7280 ,,
4. రూనే(డెన్మార్క్) : 4710 ,,
5. సిట్సిపాస్(గ్రీస్) : 4615 ,,
6. ఆండ్రీ రుబ్లేవ్(రష్యా) : 4515 ,,
7. సిన్నర్(ఇటలీ) : 4465 ,,
8. ఫ్రిట్జ్(అమెరికా) : 3955 ,,
9. కాస్పర్ రూఢ్(నార్వే) : 3560 ,,
10. జ్వెరేవ్(జర్మనీ) : 3030 ,,
సబలెంకాకు అగ్రస్థానం..

మహిళల ఎటిపి ర్యాంకింగ్స్‌లో యుఎస్ ఓపెన్ రన్నరప్ ఆర్యానా సబలెంక సత్తా చాటింది. తాజా ఎటిపి ర్యాంకింగ్స్‌లో సబలెంకా అగ్రస్థానానికి ఎగబాకింది.
మహిళల టాప్-10 ర్యాంకింగ్స్...
1. అర్యానా సబలెంకా(బెలారస్) : 9266 పాయింట్లు
2. ఇగా స్వైటెక్(పోలండ్) : 8195 ,,
3. కోకా గాఫ్(అమెరికా) : 6165 ,,
4. ఎలెనా రైబకినా(కజకిస్తాన్) : 5790 ,,
5. జెస్సికా పెగూల(అమెరికా) : 5755 ,,
6. వోండ్రుసోవా(చెక్ రిపబ్లిక్) : 3830 ,,
7. ఒన్స్ జబీర్(ట్యునీషియా) : 3771 ,,
8. కరోలినా ముఛోవా(చెక్) : 3765 ,,
9. మరియా సక్కారి(గ్రీక్) : 3525 ,,
10. కరోలినా గార్సియా(ఫ్రాన్స్) : 3050 ,,










