Sep 28,2023 16:55

టూనిస్‌ : అక్రమ వలసల్ని అరికట్టే చర్యల్లో భాగంగా ట్యూనిషియా అధికారులు వందలాది మంది అక్రమ వలసదారుల్ని అరెస్టు చేశారు. గడచిన 48 గంటల్లో 106 మంది అక్రమ వలసదారుల్ని అరెస్టు చేసినట్లు ట్యూనిషియన్‌ నేషనల్‌ గార్డ్‌ మంగళవారం వెల్లడించింది. ట్యునిషియా నేషనల్‌ గార్డ్‌ ఫేస్‌బుక్‌ పేజీ ప్రకటన ప్రకారం.. అక్రమ వలసల్ని అరికట్టేందుకు ఆగేయ ప్రావిన్స్‌ స్ఫాక్స్‌, సెంట్రల్‌ ట్యూనిషియాల్లో అరెస్ట్‌ ఆపరేషన్స్‌ జరిగాయి. ఇందులో భాగంగా అక్రమ వలసల స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌లకు సంబంధించి 16 మంది నిర్వాహకులతోపాటు 90 మంది వ్యక్తులు, 19 పడవలు, అందులోని వివిధ కరెన్సీల్లో ఉన్న డబ్బుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వలసదారులు యూరప్‌కి వెళ్లాలంటే.. ప్రధాన రవాణా కేంద్రాల్లో ట్యూనిషియా ఒకటిగా నిలుస్తుంది. ఈ దేశం నుంచే ఎక్కువ మంది యూరప్‌కి వెళతారు. అక్రమ వలసల్ని అరికట్టేందుకు ట్యూనిషియా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాదిలో దాదాపు 37 వేలమంది అక్రమ వలసదారుల్ని అరెస్టు చేసినట్లు ట్యూనిషియా అధికారులు చెబుతున్నారు.