Mar 24,2023 13:23

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, వైద్యాధికారి డాక్టర్‌ తిరుపతిరావు ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవము శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ... క్షయ వ్యాధిగ్రస్తుని నోటి తుంపరులు గాలి ద్వారా ఆరోగ్యవంతునికి సంక్రమిస్తాయని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తుడు మాస్క్‌ ను తప్పక వేసుకోవాలని సూచించారు. టిబి జబ్బు ముఖ్యంగా పిల్లలలో కనిపిస్తుందని, వివిధ వ్యాధులతో వారు బాధపడుతున్నారని, ముసలివారు, పోషకారం లోపం గలవారికి టిబి వచ్ఛే అవకాశం ఉందని చెప్పారు. అందరూ క్షయ వ్యాధి బారినపడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. డాక్టర్‌ తిరుపతిరావు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఆరోగ్య విస్తరణ అధికారులు సత్యనారాయణ, మురళీకృష్ణ, రామ్మూర్తి పారా మెడికల్‌ సిబ్బంది, విజయలక్ష్మి సత్యవతిలు పాల్గొన్నారు.