Jul 06,2023 15:02

ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌జిల్లా) : సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబు జగజీవన్‌రామ్‌ అని జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. రెడ్డిగూడెం మండల పరిషత్‌ కార్యాలయంలో, కూనపరాజుపర్వ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మద్దులపర్వ పాలకేంద్రంలో జగజ్జివన్‌రామ్‌ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు బలగని తిరుపతిరావు, ఎస్‌సి సెల్‌ మండల అధ్యక్షుడు వీరమళ్ళ సుధాకర్‌, నాయకులు రామినేని వీర స్వామి నాయుడు, అంజిరెడ్డి, తహశీల్దార్‌ పాల్‌, ఎండిఓ విష్ణు ప్రసాద్‌, ఉపసర్పంచి తోటకూర రవిబాబు, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలువేసి ఘన నివాళులర్పించారు.