Nov 12,2022 14:24

ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో గల పెదబయలు మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజం ఆశ్రమ ఉన్నత బాలికల, బాలుర పాఠశాలలను శనివారం గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొమ్మ పధ్వీరాజ్‌ అలాగే మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు తల్లాబు కౌసల్య సందర్శించారు. పాఠశాల విద్యార్థులు అందరిని పిలిపించి గజ్జి తామర దురద వంటి చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను ఉద్దేశించి ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు తెలియజేశారు. సీత గుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కోర్ర జగన్‌ అనే విద్యార్థికి శరీరం మొత్తం ఎర్రటి కురుపులు వచ్చి తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి ఏడాది శీతకాలం ప్రారంభం మొదలు గిరిజన విద్యార్థులకు తీవ్రమైన చర్మ వ్యాధులు వెంటాడి పీడిస్తూ ఉన్నాయని వీటి నివారణ కోసం ప్రభుత్వం చొరవ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు సబ్బులు షాంపూలు పేస్టు బ్రెష్‌ తో పాటు అనేక రకాల కాస్మోటిక్‌ ఇచ్చే వారిని ఇప్పుడు అమ్మ వాడి పేరుతో అవన్నీ తీసివేయడం మూలంగా మరింత చర్మవ్యాధులు పెరిగి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందన్నారు. స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పటికీ మెరుగైన వైద్యం అందకపోవడంతో శాశ్వత నివారణ దొరకడం లేదని ఈ విషయమై గత రెండు వారాల క్రితం పెదబయలు మండలానికి చెందిన రూడకోట ఆశ్రమ బాలుర పాఠశాలను గిరిజన సంఘం కేంద్ర కమిటీ సభ్యులు పాచిపెంట అప్పల నరస గారు సందర్శించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని అయినప్పటికీ ఆశించదగ్గ ప్రయత్నం చెయ్యకపోవడం విచారకరణమని అన్నారు.

girijana students