ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జిఒఆర్‌టి నెంబరు 1484ని విడుదల చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2017 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ధ్యానచంద్రను గ్రామ వార్డు సచివాలయ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న గంధం చంద్రుడు (2010 ఐఎఎస్ అధికారి)ని ఉద్యానవన శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఇప్పటివరకు అక్కడ విధుల నిర్వహిస్తున్న ఎస్‌ఎస్ శ్రీధర్ (ఐఎఫ్‌ఎస్ 1992 బ్యాచ్)ను జిఎడిలో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న 2017 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన నిశాంతిని సిసిఎల్‌ఎ జాయింట్ సెక్రటరీగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న 2018 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీవాస్ నుపూర్ అజరుకుమార్‌ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క లెక్టర్‌గా, ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న హిమాన్షు శుక్లాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాటిమాకుల రాహుల్ కుమార్‌రెడ్డిని నంద్యాల జెసిగా నియమించారు. నరసాపూర్ సబ్ కలెక్టర్ మల్లవరపు సూర్యతేజను కెఆర్ పురం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసరుగా ప్రభుత్వం నియమించింది.










