ఉంగుటూరు (ఏలూరు) : కారును ట్రాక్టరు ఢీకొట్టడంతో నలుగురికి స్వల్పగాయాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున 216 వ జాతీయ రహదారి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జరిగింది. ఓ కుటుంబం వివాహానికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. హైవే సేఫ్టీ సిబ్బంది, పోలీసులు కారును ట్రాక్టరును పక్కకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడినవారికి హైవే అంబులెన్స్ లో ప్రథమ చికిత్స చేసి తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










