ఇటలీ వివాహం చేసుకున్న దంపతులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు శనివారంనాడు హైదరాబాదుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో అభిమానులు పెద్దఎత్తున చేరుకుని స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. ఇటలీ వెళ్లిన మెగా కుటుంబ సభ్యులంతా తిరిగి వచ్చేశారు. వీళ్లందరికన్నా ఒకరోజు ముందుగానే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ దంపతులు కూడా ముందుగానే వచ్చేశారు. చిరంజీవి, నాగబాబు, చిరంజీవి కుమార్తెలు, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, రామ్ చరణ్, ఉపాసన తమ పాపతో చేరుకున్నారు. వచ్చేశారు. మణికొండలోని వారి స్వగృహానికి చేరుకున్నారు. ఆదివారంనాడు హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమలోని అతిథిల కోసం రెసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.