వచ్చే ఏడాది ఆస్కార్ కోసం ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. 'బలగం', 'దసరా' సినిమాలతో పాటుగా 'ది కేరళ స్టోరీ', 'గదర్-2', 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని', 'జ్విగాటో', 'దీ స్టోరీ టెల్లర్' వంటి పలు సినిమాలు ఎంట్రీకి వెళ్లాయి. ప్రముఖ ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షిస్తోంది. బలగం, జ్విగాటో, విడుదలై-1 సినిమాల్లో ఒకటి ఆస్కార్ ఎంట్రీ సాధించే చాన్స్‌లు అధికంగా ఉన్నాయని సమాచారం.










