సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్' చిత్ర ట్రైలర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళికి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.










